¡Sorpréndeme!

CSK vs KKR Match Preview IPL 2025 | KKR తో మ్యాచ్ నుంచి CSK కెప్టెన్ గా ధోని | ABP Desam

2025-04-11 1 Dailymotion

 కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ గాయం కారణంగా ఈ ఐపీఎల్ సీజన్ నుంచి తప్పుకోవటంతో మహేంద్ర సింగ్ ధోనీ చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ గా మళ్లీ బాధ్యతలు స్వీకరించారు. 2023లో ఐపీఎల్ ట్రోఫీ గెలిచిన తర్వాత కెప్టెన్సీని రుతురాజ్ గైక్వాడ్ కు అప్పగించిన ధోనీ..ఇప్పుడు రుతు గైర్హాజరీలో మరోసారి కెప్టెన్ గా బరువు బాధ్యతలను భుజాలకు ఎత్తుకున్నాడు. ఇప్పటివరకూ జరిగిన 17 సీజన్లలో 10 సార్లు తన జట్టును ఫైనల్ కి తీసుకువెళ్లిన ధోనీ..తన టీమ్ సీఎస్కేకి ఐదుసార్లు ట్రోఫీ అందించాడు. మరి అలాంటి మ్యాజిక్ ను మాహీ మళ్లీ రిపీట్ చేయాలని సీఎస్కే ఫ్యాన్స్ అయితే ఆశగా ఎదురు చూస్తున్నారు. రుతురాజ్ కి రీప్లేస్ గా జానీ బెయిర్ స్టోను తీసుకుంటున్నారనే ప్రచారం నడుస్తోంది. చూడాలి ఓపెనింగ్ కి ఎవరు వస్తారో...డెవాన్ కాన్వే, రచిన్ రవీంద్ర, దూబే, త్రిపాఠి, ధోనీ, జడేజాలతో బ్యాటింగ్ లైనప్ అయితే పటిష్ఠంగా కనిపిస్తోంది కానీ ఎప్పుడు ఎవరు ఆడతారో తెలియని పరిస్థితి. బౌలింగ్ లోనూ అశ్విన్, పతిరానా లాంటి స్టార్లు ఇప్పటివరకూ సీజన్ లో మెరవలేదు. నూర్ అహ్మద్ ఒక్కడే పర్పుల్ క్యాప్ రేస్ లో దూసుకెళ్తున్నాడు. చాలా సెట్ రైట్ చేయాల్సి ఉంది చూడాలి ఏం చేస్తాడో.  మరో వైపు కేకేఆర్ సీఎస్కేతో పోలీస్తే చాలా ధృడంగా ఉంది. ప్రధానంగా కెప్టెన్ అజింక్యా రహానే ఉన్న ఫామ్ వాళ్లకు బలం. సునీల్ నరైన్ తో మొదలుపెడితే,.రఘువంశీ, రహానే, వెంకటేశ్ అయ్యర్, రసెల్, రింకూసింగ్, గుర్భాజ్ లతో బ్యాటింగ్ యూనిట్ స్ట్రాంగ్ గా ఉంది. బౌలింగ్ లో నరైన్, వరుణ్ చక్రవర్తి స్పిన్ కి తోడుగా పేస్ బౌలింగ్ తో హర్షిత్ రానా, వైభవ్ అరోరా, రసెల్ బరువు బాధ్యతలు పంచుకుంటారు. ఈ చూడాలి ఈ  సీజన్ లో కెప్టెన్ గా మళ్లీ ఆడుతున్న ధోని ఫస్ట్ మ్యాచ్ లో ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో చూడాలి.